'డిస్కోరాజా'గా అలరించేందుకు సిద్ధమయ్యాడు మాస్ మహారాజా రవితేజ. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇది కాకుండా 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఇతడికి సంబంధించిన ఓ వార్త ఆసక్తి రేపుతోంది. త్వరలో తీయబోయే 'ఎఫ్ 2' సీక్వెల్లో రవితేజ ఓ హీరోగా సందడి చేయనున్నాడని సమాచారం.
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ 'ఎఫ్ 2'. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి.. తన హాస్య ప్రతిభతో థియేటర్లో నవ్వులు పూయించాడు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'ఎఫ్ 3'ని తీయాలనుకుంటున్నారు. ఇందులో వెంకీ, వరుణ్‌తో పాటే రవితేజ నటించనున్నాడని టాక్.
దర్శకుడు అనిల్, నిర్మాత దిల్‌రాజు.. 'ఎఫ్ 2' సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కొత్త ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.