బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు సంబంధించి డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే నటి రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దోషులుగా తేలిన వారికి తగిన శిక్ష విధించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది.
-
Twas high time for clean up to happen.Very welcome!Will help our young/future generations.Start from here,surely,proceed to all sectors.Uproot it from its core.Punish th Guilty,users,the dealers/suppliers.The profiting Big Guys on the take,who give it a blind eye and ruin people.
— Raveena Tandon (@TandonRaveena) September 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Twas high time for clean up to happen.Very welcome!Will help our young/future generations.Start from here,surely,proceed to all sectors.Uproot it from its core.Punish th Guilty,users,the dealers/suppliers.The profiting Big Guys on the take,who give it a blind eye and ruin people.
— Raveena Tandon (@TandonRaveena) September 22, 2020Twas high time for clean up to happen.Very welcome!Will help our young/future generations.Start from here,surely,proceed to all sectors.Uproot it from its core.Punish th Guilty,users,the dealers/suppliers.The profiting Big Guys on the take,who give it a blind eye and ruin people.
— Raveena Tandon (@TandonRaveena) September 22, 2020
"ఇప్పటి వరకు పేరుకున్న మురికి శుభ్రం కావడానికి చాలా సమయం పడుతుంది. మన భవిష్యత్ తరాలకు అండగా నిలబడేందుకు మీరు సరైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మొదలు పెట్టి అన్ని రంగాల్లో పాతుకుపోయిన డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో సహా పెకలించండి. ఇందుకు సంబంధించిన డీలర్లు, దోషులను అందర్నీ శిక్షించండి."
-రవీనా టాండన్, బాలీవుడ్ నటి
రవీనా అభిప్రాయలకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించాలని చెప్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఇటీవలే దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ సీఈఓ ధ్రువ్ చిట్గోపేకర్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రవీనా ట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే విచారణలో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ సహా పలువురిని అరెస్టు చేశారు అధికారులు.