కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్‌లు ధరించడం చేస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణం చేసిన నటి రవీనా టండన్.. తన బెర్తును తానే శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంది. ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని రాసుకొచ్చింది. మీ కోసమే కాకుండా చుట్టూ ఉండే వారికోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. మాస్క్ ఉపయోగించే విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలంది.