కొత్త సంవత్సం రోజున అభిమానుల్లో జోరు నింపేందుకు సిద్ధమైంది స్టార్ హీరోయిన్ రష్మిక. బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ బాద్ షా రూపొందిస్తోన్న ర్యాప్ పాటకు కాలు కదపనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణ చంఢీగడ్‌లో జరుగుతోంది. ఈ గీతాన్ని ఈ ఏడాది డిసెంబరు 31 సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇందులో గాయకులు అమిత్ ఉచానా, యువన్ కూడా కనువిందు చేయనున్నారు.
ప్రస్తుతం రష్మిక.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. చంఢీగడ్‌లో పాటల చిత్రీకరణ పూర్తవ్వగానే 'పుష్ప' సెట్లో అడుగుపెడుతుంది.
ఇదీ చూడండి: చరణ్ సరసన రష్మిక నటించనుందా?