నటి రష్మిక తన చేతి ఉంగరాన్ని చూసుకోని మురిసిపోతుంది. తనకు అత్యంత ప్రియమైన వ్యక్తుల నుంచి ఆ ఉంగరం అందిందట. తనకందిన ఆ అపురూప కానుకను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది ఆమె.
"ఇది నాకు ఎవరు పంపారో తెలుసు. దీన్ని నేను అందుకున్నా. నేను మీ రహస్య సందేశాన్ని చదివాను. నాకిది సరిగ్గా సరిపోయింది. నేను దీన్ని ప్రేమిస్తున్నాను" అంటూ రష్మిక ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యనూ జత చేసింది. దీంతో ఇప్పుడీ ఉంగరం కథ కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది.
రష్మిక పస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో ఆమె ఎంట్రీ ఇస్తున్న 'సుల్తాన్' ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కార్తి కథానాయకుడిగా నటిస్తున్నాడు. దీంతో పాటు, అల్లు అర్జున్‌తో 'పుష్ప', 'మిషన్‌మజ్ను', 'ఆడాళ్లు మీకు జోహార్లు' చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ గాయకుడు మృతి