ETV Bharat / sitara

రష్మికకు బంపర్​ ఆఫర్​.. రణ్​బీర్​ సినిమాలో స్పెషల్​ సాంగ్​! - సమంత

Rashmika Mandanna: బాలీవుడ్ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​ కొత్త సినిమాలో బ్యూటీ క్వీన్ రష్మిక.. ఓ స్పెషల్​ సాంగ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Rashmika Mandanna
రష్మిక
author img

By

Published : Mar 13, 2022, 4:37 PM IST

Rashmika Mandanna: 'పుష్ప'లో హీరోయిన్​గా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది నటి రష్మిక. ఈమె త్వరలోనే ఓ బాలీవుడ్​లో చిత్రంలో మెరవనున్నట్లు తెలుస్తోంది. 'అర్జున్​రెడ్డి' దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' సినిమాలో రష్మిక స్పెషల్​ సాంగ్ చేయనుందని బీటౌన్​ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అనిల్​ కపూర్​, బాబీ డియోల్​, పరిణితి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Rashmika
రష్మిక

ప్రస్తుతానికి ఈ పాటకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రష్మిక స్పెషల్​ సాంగ్​లో నటిస్తే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం రష్మిక స్పందించలేదు. 'పుష్ప' సినిమాలో సమంత నటించిన స్పెషల్​ సాంగ్​ 'ఊ అంటావా మావా' విజయంవంతం కావడం వల్ల.. ఈ సినిమాలోనూ స్పెషల్​ సాంగ్​ పెట్టాలని చిత్ర యూనిట్​ భావిస్తోంది.

Rashmika
బ్యూటీ రష్మిక

రష్మిక.. ఇటీవలే శర్వానంద్​తో కలిసి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో నటించింది. 'పుష్ప' సీక్వెల్​గా వస్తున్న 'పుష్ప ది రూల్​' చిత్రంలోనూ నటిస్తుంది.

ఇదీ చదవండి: చీరకట్టులో జాక్వెలిన్​.. బికినీలో చిత్రాంగదా హాట్​ ట్రీట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.