ETV Bharat / sitara

ముంబయిలో ఖరీదైన ఇల్లు కొన్న రష్మిక!

author img

By

Published : Feb 26, 2021, 1:56 PM IST

Updated : Feb 26, 2021, 2:04 PM IST

దక్షిణాది చిత్రపరిశ్రమల్లో వరుస సినిమాలతో పాటు బాలీవుడ్​లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు హీరోయిన్​ రష్మిక. తెలుగులో 'పుష్ప'తో సహా హిందీలో 'మిషన్​ మజ్ను' అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్​ కోసం రష్మిక ముంబయిలో ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది.

Rashmika Mandanna buys new home in Mumbai: Report
ముంబయిలో ఖరీదైన నివాసం కొన్న రష్మిక!

వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్నారు కథానాయిక రష్మిక. కన్నడలో 'కిర్రాక్‌పార్టీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్‌ గడుపుతున్నారు. తెలుగులో స్టార్‌ హీరోల చిత్రాల్లో ఆఫర్స్‌ సంపాదించుకుంటోన్న రష్మిక.. ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సిద్దార్థ్‌ మల్హోత్ర సరసన 'మిషన్‌ మజ్ను'లో నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూట్‌లో గత కొన్నిరోజుల నుంచి ఆమె పాల్గొంటున్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం ఇటీవల రష్మిక ముంబయిలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వరుస షూటింగ్స్‌లో భాగంగా ఇటు దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ ఉండాల్సి వస్తుందట. దీంతో, ఇంటి విషయంలో ప్రతిసారీ ఇబ్బందిపడకుండా ఉండేలా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రష్మిక.. ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తనకెంతో ఇష్టమైన కొన్ని వస్తువులను సైతం హైదరాబాద్‌లోని ఇంటి నుంచి ముంబయికు తీసుకువెళ్లారట ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ వార్తలపై ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చూడండి: ఆస్కార్​ రేసులో 'సూరారై పొట్రు'.. మార్చి 5 నుంచి ఓటింగ్​

Last Updated : Feb 26, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.