'ఛలో'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక.. ఆపై 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ జంటగా 'పుష్ప'లో నటిస్తుంది. ఇందులో సరికొత్త పాత్రలో కనిపించనుంది. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రష్మిక.. సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

లాక్‌డౌన్‌ను తొలగించిన తర్వాత మీరు చేసే మొదటి పని ఏంటి?
రష్మిక: వెళ్లి నా స్నేహితుల్ని కలుస్తా. వారి జాబితా చాలా పెద్దది.
మీ పెంపుడు కుక్క పేరు ఏంటి?
రష్మిక: నా దగ్గర 5 పెద్ద కుక్కలు, 8 కుక్క పిల్లలు ఉన్నాయి. నీకు ఏ కుక్కపేరు కావాలి? (పగలబడి నవ్వుతూ)
మీకు ఇష్టమైన హీరో ఎవరు? విజయ్ దేవరకొండ లేదా నితిన్?
రష్మిక: మీకెవరు ఇష్టం?
మీ ఫోన్ వాల్‌పేపర్ చూపించండి?
రష్మిక: స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన రష్మిక

హిందీలో నటించే అవకాశాలు ఉన్నాయా? నేను మీకు పెద్ద అభిమానిని.
రష్మిక: ఆలోచిస్తున్నా
మీరు నా కామ్రేడ్?
రష్మిక: నువ్వే నా కామ్రేడ్.
నటననే ఎందుకు కెరీర్‌గా ఎంచుకున్నారు?
రష్మిక: ప్రేక్షకుల నవ్వుకు నేను ఓ కారణం కావాలి అనుకున్నా. అది ఒక్క సెకను అయినా చాలు.

అంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు?
రష్మిక: పరిస్థితులు ఎలా ఉన్నా, నాకెంత కష్టంగా ఉన్నా.. వ్యాయామాన్ని మాత్రం వదలను.

మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వంటలు చేస్తారా?
రష్మిక: నేను కేకులు, స్వీట్స్ చేస్తా.
మేం మీ సినిమాల్ని చూస్తున్నట్లే.. మీరు మీ చిత్రాల్ని చూస్తుంటారా?
రష్మిక: నవ్వొస్తోంది.. నేను ఎక్కువగా టీవీ చూడను. ఇంట్లో నేను చూసుకోవాల్సిన ఆకతాయిలు (పెంపుడు జంతువుల్ని ఉద్దేశిస్తూ) చాలా ఉన్నాయి.
తమిళ సినిమాలో ఎప్పుడు నటిస్తారు?
రష్మిక: ఇప్పటికే నటించా. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిస్తున్నా.
మీరు హిందీ మాట్లాడతారా?
రష్మిక: మీకేమైనా అనుమానమా?
మీరు 'పుష్ప' కోసం విభిన్న యాస నేర్చుకుంటున్నారని తెలిసింది. అది నిజమేనా?
రష్మిక: అవును.. అది మీకెలా తెలిసింది?
ఆ దేవుడు నాకు ఎదురైతే.. నన్ను నీ భర్తను చేయమని అడుగుతా..
రష్మిక: దయచేసి ముందు ఇతడి అనుమతి తీసుకో.. అంటూ తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేశారు.

మీరు నటి కాకపోయుంటే ఏం అయ్యేవారు?
రష్మిక: బహుశా జీవితాంతం క్వారంటైన్‌లో ఉండేదాన్నేమో.
వీడియో ద్వారా మీ ఇంటిని మాకు చూపిస్తారా?
రష్మిక: నో.. ఇది నా వ్యక్తిగత ప్రదేశం.
'దిల్‌వాలే' సినిమాలో షారుక్, కాజోల్‌లా మీరు నాతో ఐదు నిమిషాలు డేట్‌కు వస్తారా?
రష్మిక: నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు.

ఇదీ చూడండి : ఐసీయూలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్