ETV Bharat / sitara

రష్మికి బంపర్​ ఆఫర్​.. చిరుతో కలిసి మాస్​ సాంగ్​లో! - chiranjeevi rashmi dance

Chiranjeevi Rashmi Dance: యాంకర్​ రష్మికి ఓ బంఫర్​ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది! ఆమె మెగాస్టార్​ చిరంజీవితో కలిసి ఓ మాస్​ సాంగ్​లో స్టెప్పులేయనుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

మెగాస్టార్​ చిరుతో రష్మి డ్యాన్స్​, rashmi dance with rashmi
మెగాస్టార్​ చిరుతో రష్మి డ్యాన్స్​
author img

By

Published : Nov 24, 2021, 3:07 PM IST

Chiranjeevi dance with rashmi: ఓ వైపు యాంకర్​గా మరోవైపు నటిగా టాలీవుడ్​లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రష్మి. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ ఓ బంపర్​ ఆఫర్​ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్​ చిరంజీవితో కలిసి ఆమె స్టెప్పులేయనుందట!

సోదరి సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా 'భోళాశంకర్‌'. ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. ఇందులో రష్మి కూడా నటిస్తుందని అదేరోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. 'భోళాశంకర్‌'లో ఓ మాస్​ సాంగ్​ను పెట్టేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. అంతా ఓకే అయితే.. ఆ పాటలోనే చిరుతో కలిసి రష్మి డ్యాన్స్​ వేయనుందని సమాచారం. శేఖర్‌ మాస్టర్‌ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే రష్మికి బంపర్‌ ఆఫర్‌ వరించినట్లే.

కాగా, తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న 'వేదాళం' రీమేక్‌గా 'భోళాశంకర్‌' తెరకెక్కుతోంది. ఇందులో చిరు సోదరిగా కీర్తిసురేశ్‌ నటించనున్నారు. అలాగే ఆయనకు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు.

ఇదీ చూడండి: Rashmi dance: డ్యాన్స్​తో హీట్ పెంచేస్తున్న రష్మీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.