ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్‌లో 'ప్రేమికుడు' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించాడు. 1994లో విడుదలైన ఈ చిత్రం ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సినీప్రియుల్ని ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని 'ముక్కాబులా..’', 'ఊర్వశీ..' గీతాలు నాటి నుంచి నేటి వరకు యువతరం మదిలో మారుమోగుతూనే ఉన్నాయి.
ఈ ఆల్బమ్‌లోని పాటల్లో 'టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ' పాట అంటే తనకూ ఎంతో ఇష్టమన్నాడు రణ్‌వీర్ సింగ్. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు. ఈ పాటను తాను ప్రతిరోజూ వింటుంటానని, అందుకే ఆ పాట ఇప్పటికీ తన మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినట్లు రణ్‌వీర్ తెలిపాడు. అంతేకాదు.. ఈ పాట హిందీ వెర్షన్‌ను ఎంతో చక్కగా ఆలపించి చూపించాడీ హీరో. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఏఆర్ రెహమాన్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ సందడి చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. పాడుతూ స్టేజిపై నుంచి కిందపడ్డ పాప్ సింగర్