నటనతో కాకుండా విభిన్నమైన ఫ్యాషన్‌తోనూ అలరిస్తుంటాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఎప్పటికప్పుడు విచిత్రమైన దుస్తులు ధరిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవల ణ్వీర్ ధరించిన కళ్లజోడు గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు టీమిండియా క్రికెటర్ ధోనీ. తన కూతురు జీవా దగ్గర అలాంటిదే ఉందంటూ ఓ ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
"జీవా.. తన కళ్లద్దాలు అతను (రణ్వీర్ సింగ్) పెట్టుకున్నాడేంటని నన్ను ఒకరోజు అడిగింది. వెంటనే తన గదిలోకి వెళ్లి తనవి ఉన్నాయో లేదో వెతికి.. దొరికిన వెంటనే సంతోషపడింది. ఇప్పటి పిల్లలు చాలా విభిన్నం. ఆ వయసులో నేనైతే, కనీసం ఇద్దరి దగ్గరా ఒకేలాంటి కళ్లజోడు ఉందని కూడా గుర్తుపట్టేవాడని కానేమో. తర్వాత ఎప్పుడైనా జీవా.. రణ్వీర్ను కలిసినప్పుడు కచ్చితంగా ఈ కళ్లద్దాల గురించి అడుగుతుంది" -మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియా క్రికెటర్
ప్రస్తుతం క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నాడు ధోనీ. డిసెంబరులో వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌లో అందుబాటులోకి రానున్నాడని సమాచారం.
హీరో రణ్వీర్ సింగ్.. ప్రస్తుతం '83' సినిమాతో బిజీగా ఉన్నాడు. 1983 క్రికెట్ ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కుతోందీ చిత్రం. దీపికా పదుకుణే, తాహిర్ రాజ్ బాసిన్, హార్డీ సంధు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
ఇది చదవండి: