ETV Bharat / sitara

బాలీవుడ్​లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన 'రంగీలా'!

author img

By

Published : Sep 8, 2020, 9:34 PM IST

ఆమిర్​ ఖాన్​, ఊర్మిళ, జాకీష్రాఫ్​ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగీలా'. సంచలన దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ మూవీ సీక్వెల్​పై స్పందించాడు వర్మ.

Rangeela
రంగీలా

తొలి సినిమా 'శివ'తోనే సరికొత్త ట్రెండ్​ సృష్టించిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆ తర్వాత బాలీవుడ్‌లో వర్మ తీసిన 'రంగీలా' చిత్రం అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈ చిత్రం కోసం ఏ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరిచిన 'యాయిరే..యాయిరే..' పాట నటి ఊర్మిళకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 1995, సెప్టెంబర్‌ 8న విడుదలైన ఈ చిత్రం నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్జీవీ.. తను సాధించిన విజయంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

"నిజం చెప్పాలంటే.. నా కెరీర్​లో ఎన్నో సినిమాలు తీశా. వాటిలో ఈ తరహా చిత్రాలు చాలానే ఉన్నాయి. కేవలం 'రంగీలా', 'సత్య' మాత్రమే నా సినిమాలన్నింటిల్లో గొప్పవని ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి.. వీటిని మళ్లీ చిత్రీకరించే ఉద్దేశం అసలు లేదు."

-ఆర్జీవీ, దర్శకుడు

ఈ క్రమంలోనే తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఊర్మిళ కృతజ్ఞతలు తెలిపింది. ఊర్మిళ, ఆమిర్​ఖాన్​ ప్రధాన పాత్రలో నటించగా.. జాకీష్రాఫ్​ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి నటి ఊర్మిళ ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది. అప్పట్లో 'రంగీలా'కు పన్నెండు ఫిలింఫేర్‌ అవార్డులు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.