మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. 'రంగస్థలం' తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదలైంది.
పవర్‌ఫుల్ డైలాగులు, నేపథ్య సంగీతంతో సందడి చేస్తోందీ ట్రైలర్. ఈ సినిమాను తమిళనాడులో 300లకు పైగా స్ర్కీన్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తోంది డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థ 7జీ ఫిల్మ్స్. తెలుగునాట ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలై ఘన విజయం అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">