బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆలియా.. ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కళంక్'. బాలీవుడ్‌లో స్టార్ నటీనటులు వరుణ్ ధావన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా వంటి భారీ తారాగణం ఇందులో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీపెద్దగా రాణించలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఆ సినిమా ఫలితంతో ఆలియా డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట. అప్పుడు రణ్‌బీర్ మద్దతుతోనే బయటపడగలిగినట్లు చెప్పింది.
"నువ్వు ఇవ్వగలిగినంత బెస్ట్ నువ్వు ఇచ్చావు. సక్సెస్ వచ్చినా రాకపోయినా యాక్టర్‌గా నీ కష్టం వృథా కాదు. మరో సినిమా రూపంలో ఆ ఫలితం తిరిగి వస్తుంది" అని రణ్‌బీర్ తనలో ఆత్మస్థైర్యం నింపినట్లు గుర్తు చేసుకుంది ఆలియా.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కలిసి నటిస్తున్నారు. ఈ భామ తెలుగులో తెరకెక్కుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోనూ కనపించనుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా సందడి చేయనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">