ETV Bharat / sitara

విరాటపర్వం: మహిళల గొప్పతనాన్ని చెప్పిన రానా - రానా విరాట పర్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని 'విరాట పర్వం' చిత్రబృందం.. మహిళల గొప్పతనాన్ని చెబుతూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. దీనికి హీరో రానా వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

virata parvam
విరాట పర్వం
author img

By

Published : Mar 8, 2021, 11:55 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హీరో రానా నటించిన 'విరాట పర్వం' నుంచి ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో మహిళల గొప్పతనం గురించి రానా వాయిస్​ ఓవర్ ఇచ్చారు. ఇందులో సాయిపల్లవి, ప్రియమణి, ఈశ్వరి రావు తదితరుల చిత్రాలు కనిపించాయి.

"చరిత్రలో దాగివున్న కథలకు తెరలేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమేనని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహాసంక్షోభమే మహా గొప్ప శాంతికి దారితీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాట పట్టిన అనేకమంది వీర తల్లులకు వీళ్లు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం. అసామాన్యం. రెడ్​ సెల్యూట్​." అంటూ రానా చెప్పిన డైలాగ్​ ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రానికి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'దృశ్యం-2'లో కీలక పాత్రలో రానా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.