'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు రానా. ఆ తర్వాత వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోల జాబితాలోకి చేరాడు. హాథీ మేరి సాథీ, 1945, విరాటపర్వంలో నటిస్తూ తీరికలేకుండా ఉన్నాడు. గుణశేఖర్ రూపొందించే 'హిరణ్యకశ్యప'లోనూ ఇతడే ప్రధాన పాత్రధారి. తన కెరీర్లో తొలిసారిగా ఓ హారర్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడని సమాచారం.
సిద్దార్థ్‌తో 'గృహం' తీసిన దర్శకుడు మిలింద్ రావు.. రానాకు ఓ కథ వినిపించాడట. ఆ స్టోరీ దగ్గుబాటి హీరోకు బాగా నచ్చిందట. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటివరకు పలు విభిన్న పాత్రలు పోషించిన రానా.. హారర్ కథతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
ఇది చదవండి: సైరా ప్రీరిలీజ్ వాయిదా!.. మరి ట్రైలర్..?