ETV Bharat / sitara

రానా ఆరోగ్యానికి థానోస్ పాత్రకు సంబంధం! - రానా పవన్ మూవీ

'అవెంజర్స్' సినిమాలోని థానోస్ పాత్ర తనలో సానుకూలతను నింపిందని హీరో రానా అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అందుకు గల కారణాన్ని వెల్లడించారు.

Rana Daggubati opens up on dark phase of his life
రానా అనారోగ్యానికి థానోస్ పాత్రకు సంబంధమేంటి?
author img

By

Published : Feb 7, 2021, 5:31 AM IST

అగ్రకథానాయకుడు రానా తన జీవితంలోని అత్యంత కఠిన ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పారు. ఇటీవల ఓ పాడ్​కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్'​ తెలుగు వెర్షన్​లో థానోస్​కు డబ్బింగ్ చెప్పడం మనసుకు ఎలా తెరిపినిచ్చిందో వెల్లడించారు.

గతంలో ఓసారి అమెరికాలో ఉన్నప్పుడు తన బీపీ గురించి వైద్యులు చెప్పారని రానా అన్నారు. కొన్ని అవయవాలు కూడా విఫలమవుతాయని చెప్పినట్లు వెల్లడించారు. ఆ విషయాన్ని తీసుకోవడానికే చాలా సమయం పట్టిందని తెలిపారు.

అనంతరం రెండు రోజులకు 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' చూసేందుకు థియేటర్​కు రానా వెళ్లారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్​లో థానోస్​ పాత్రకు తాను డబ్బింగ్ చెప్పానని, అతడు సూపర్​ విలన్​ అని భావించినట్లు అన్నారు. అయితే సినిమా చివర్లో అన్ని పాత్రలు మరణించినా సరే థానోస్​ మాత్రమే బ్రతికే ఉంటుందని, ఆ విషయమే తనలో సానుకూల దృక్పథాన్ని తీసుకొచ్చిందని అన్నారు.

ప్రస్తుతం 'విరాటపర్వం', 'అరణ్య'(హాథీ మేరి సాథీ), అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్​లో పవన్​ కల్యాణ్​తో కలిసి రానా నటిస్తున్నారు.

Rana Daggubati virata parvam
విరాటపర్వం సినిమాలో రానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.