దగ్గుబాటి రానా హీరోగా, ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హాతి మేరి సాథి'. తెలుగులో 'అరణ్య'గా విడుదలకానుంది. ఈ సినిమా కోసం రానా ఏకంగా 30 కేజీల బరువు తగ్గాడట.
"బాహుబలి తర్వాత ప్రభు కలిసి 'హాతి మేరి సాథి' కథ చెప్పాడు. అప్పుడు నేను చాలా లావుగా ఉన్నా. అడవిలో నివసించే ఓ వ్యక్తిలా తెరపై కనిపించడానికి తగిన విధంగా మారాను. చిత్రీకరణలో మాకు చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ , ఓ కళాకారుడిగా సమాజంలో కొన్నింటిని ప్రజలకు చేరవేయటం కోసం మా వంతు కృషి చేయాలి."
-దగ్గుబాటి రానా, నటుడు
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నాడు రానా. సమాజానికి దూరంగా అడవిలో బతికే వ్యక్తి హావభావాలతో తెరపై కనిపించడానికి దర్శకుడి సలహాలను తీసుకున్నానని తెలిపాడు.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదీ చూడండి.. కార్తికేయ మాస్ లుక్.. రవితేజ ఫైర్ లుక్