ETV Bharat / sitara

మెగా హీరో సినిమాలో రానా కీలక పాత్ర! - వైష్ణవ్​ తేజ్​, రకుల్​ ప్రీత్​

యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్​, రకుల్​ప్రీత్ సింగ్​ హీరోహీరోయిన్లుగా క్రిష్​ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం రానాను ఎంపికచేసినట్లు సమాచారం.

Rana Daggubati crucial role in  Vaishnav Tej and Rakul film?
మెగా హీరో సినిమాలో నటిస్తున్న రానా!
author img

By

Published : Oct 8, 2020, 10:10 PM IST

వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు రానా. ఆయన నటించిన 'అరణ్య' ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఆయన 'విరాట పర్వం'లో నటిస్తున్నారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు, కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ప్రధానపాత్రల్లో క్రిష్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో రానా ఓ కీలక పాత్రలో నటించనున్నారని టాక్‌. అయితే, దీనిపై రానా, చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో పాటు మలయాళ సూపర్‌హిట్‌ 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌' రీమేక్​లోనూ రానా నటిస్తారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ రీమేక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.