ETV Bharat / sitara

రానా సినిమాకు తప్పిన కష్టాలు.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ - rana movies

రానా చేసిన ఓ సినిమాకు ఆరేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలవుతోంది. గురువారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

Rana
రానా
author img

By

Published : Dec 9, 2021, 4:03 PM IST

రానా దగ్గుబాటి నటించిన పీరియాడికల్‌ డ్రామా చిత్రం '1945'. సత్యశివ దర్శకుడు. ఈ చిత్రం సుమారు ఆరేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది.

ఎట్టకేలకు అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాను డిసెంబరు 31న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకుంది.

Rana 1945 movie
రానా '1945' మూవీ

ఇందులో రానా పోరాట యోధుడిగా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.