వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నారు టాలీవుడ్ యువ కథనాయకుడు రామ్ పోతినేని(Ram potineni).. మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. తన తర్వాతి సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో(Linguswamy) ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. జులై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు.
భారీగా అంచనాలు
'ఉప్పెన'తో తెలుగు తెరపై ఎగసిన కొత్త అందం కృతి శెట్టి(Kritishetty). తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారుల మతి పోగొట్టింది. ఈ సినిమాలో రామ్ సరసన ఈ చిన్నదే హీరోయిన్గా సందడి చేయనుంది. మరోవైపు హీరో రామ్ వరుస హిట్లతో జోష్ మీద ఉండటం, ఈ కొత్త జోడీ కలయిక వల్ల అభిమానుల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడం వల్ల సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: టాలీవుడ్లో కొత్త జంటలు.. పెరుగుతున్న అంచనాలు