ETV Bharat / sitara

''కరోనా వైరస్' సినిమా పొరపాటున తీశాను' - కరోనా సినిమా రిలీజ్​ డేట్​

కరోనా సంక్షోభ సమయంలోనూ దర్శకుడు రామ్​ గోపాల్​వర్మ సినిమా తీశారు. త్వరలో ఈ చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ విశేషాలను పంచుకున్నారు.

RAMGOPAL VARMA SPECIAL INTERVIEW UPON HIS NEW MOVIE CORONA VIRUS
ఎలా చేశాను అనేది నన్ను అడక్కండి: ఆర్జీవీ
author img

By

Published : May 31, 2020, 7:35 AM IST

లాక్‌డౌన్‌తో చిత్ర పరిశ్రమంతా స్తంభించిపోయింది. తారలు, సాంకేతిక నిపుణులు ఇంటికే పరిమితయ్యారు. రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం ఎప్పట్లాగే సినిమాను తీసేశారు. అమితాబ్‌ బచ్చన్‌ దగ్గర్నుంచి మణిరత్నం వరకు వర్మ తీసిన సినిమా గురించి మాట్లాడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 'కరోనా వైరస్‌' పేరుతో ఆయన తెరకెక్కించిన చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ విశేషాలతో పాటు కరోనా మహమ్మారి, ఓటీటీల ట్రెండ్‌ తదితర విషయాల గురించి వర్మ, శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

లాక్‌డౌన్‌లో ఎవరూ బయటికి రావద్దని ప్రభుత్వాలు చెప్పినా మీరెలా సినిమా తీశారు?

ప్రభుత్వ నిబంధనలకు లోబడే సినిమా తీశాం. ఎలా తీశామన్నది మాత్రం రహస్యం. అది చెబితే అందరూ నేర్చుకుంటారు. మా చిత్రబృందం సమష్టి కృషితోనే 'కరోనా వైరస్‌' సినిమా పూర్తయ్యింది.

కరోనా వైరస్‌ వల్ల మీ నుంచి కుటుంబ కథా చిత్రం రాబోతోందన్న మాట...

ఇది నేను తీసిన మొదటి కుటుంబ కథా చిత్రం. ఇదేదో పొరపాటున తీశా. మరో రెండు వారాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. కుటుంబ నేపథ్యంలో సాగినా ఇది ఓ హారర్‌ చిత్రమే. ఇక్కడ దెయ్యానికి బదులు కరోనా వైరస్‌ ఉందంతే.

ప్రత్యేకంగా 'ఆర్జీవీవరల్డ్‌.ఇన్‌' యాప్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

నేను తీసే సినిమాలు కొంత మంది ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా ఉండొచ్చు. ఆ పరిమిత ప్రేక్షకులకు థియేటర్ల కంటే డిజిటల్‌ వేదికలే మేలు. నేను ఇప్పుడు తీసిన 'క్లైమాక్స్‌' లాంటి సినిమాలు ఫోన్లో అయితే వెంటనే చూస్తారు. కానీ ఇలాంటి సినిమా కోసం థియేటర్‌కు వెళ్లాలనుకోరు. సాధారణ సినిమా రెండు నుంచి రెండున్నర గంటలు ఉంటుంది. 'క్లైమాక్స్‌' నిడివి 50 నిమిషాలు ఉంటుంది. నా దృష్టిలో సినిమా నిడివి ఎంతున్నా దాంతో ప్రేక్షకులను ఆకర్షించాలి. ఆ పని ఇలాంటి డిజిటల్‌ వేదికలతోనే సులువు. అందుకే ఇలాంటి వేదిక ఏర్పాటు చేయాలనుకున్నా. దీనిలో సినిమా చూసిన ప్రతిసారి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

"కరోనా లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు.. దాని పర్యవసనాలను ఊహించలేం. జనతా కర్ఫ్యూ తర్వాత ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఎలాంటి సమస్యలొస్తాయో చెప్పడానికీ సమయం లేదు. ఇంత పెద్ద మొత్తంలో వలస కార్మికులు నడిచి వెళ్లిపోతారు అని ఎవరైనా అనుకుంటారా? వాళ్లు పాదయాత్ర మొదలుపెట్టే వరకూ ఎవరూ ఊహించి ఉండరు".

గతంలో కమల్‌ హాసన్‌ ఇటువంటి ప్రయోగానికి మొగ్గుచూపి వెనుకడుగు వేశారు కదా?

కమల్‌ ఈ ప్రయోగం చేసినప్పుడు ప్రతి ఇంట్లో సెట్‌ టాప్‌ బాక్సులు ఉండేవి కాదు. పైగా 'విశ్వరూపం' భారీ బడ్జెట్‌ చిత్రం. డీటీహెచ్‌లో విడుదల చేస్తే జనాలు థియేటర్లకు వస్తారో లేదో అనే సందిగ్ధంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందుకే ఓటీటీ వేదికే మాకున్న వెసులుబాటు.

మీ యాప్‌లో ఎలాంటి చిత్రాలు విడుదల చేస్తారు?

ఆర్జీవీవరల్డ్‌.ఇన్‌ యాప్‌లో నాకు ప్రత్యేకంగా నచ్చిన సినిమాలు మాత్రమే ఉంటాయి. ఆ చిత్రాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపర్చాల్సిన అవసరం నాకు లేదు. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమాలు నేను తీయను. ఎవరికి వారు వేరు వేరు గదుల్లో కూర్చొని చూసే సినిమాలే తీస్తా.

'కరోనా వైరస్‌' సినిమాలో రాజకీయ నాయకులపై సెటైర్లు వేసినట్టున్నారు?

నేనేం సెటైర్లు వెయ్యలేదు. వాళ్లు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ అని మాట్లాడిన మాట వాస్తవం. దాని తరువాతే కరోనా ప్రబలింది. డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి మన నాయకుల వరకు ఎవరూ కరోనాను సీరియస్‌గా తీసుకోలేదు. కాబట్టి ఎవరినని నిందిస్తాం? చైనాలో జనవరిలోనే ఈ మహమ్మారి ప్రబలినప్పుడు మనందరం సినిమా చూసినట్టు చూశాం. చాలా మంది చైనా.. కరోనా గురించి చెప్పలేదని మాట్లాడుతున్నారు. కానీ ఆ దేశం అక్కడి నగరాలను లాక్‌డౌన్‌ చేస్తున్నప్పుడు మనందరం చూశాం కదా! అప్పటికీ అక్కడి నుంచి జనాలు వస్తున్నారు, వెళ్తున్నారు. అందులో ఆ దేశం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం ఉంది?. ఆ సమయంలోనే అహ్మదాబాద్‌లో మోదీ, ట్రంప్‌ లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరూ ఈ ఉపద్రవాన్ని ఊహించలేదు కాబట్టే ఇవన్నీ చేశారు. ఇటువంటివి ఎప్పుడూ రాలేదు కాబట్టే ఆ సమయంలో ఏ ఆలోచన వస్తే దాన్ని మాత్రమే ఆచరణలో పెట్టాం.

మీరు ఈ మధ్యే తాతయ్యారు కదా...

ఏదైనా సరే చచ్చినట్టు భరించాలి. కరోనాను భరించాలి. అలాగే నేను తాతనయ్యానన్నదాన్ని కూడా భరించాలి. ఇంకా నేను నా మనవరాలిని చూడలేదు.

కరోనాతో మనం సహజీవనానికి అలవాటు పడినట్టేనా?

చావుకు జబ్బో, ప్రమాదమో ఇలా ఎన్నో రకాల కారణాలుంటాయి. ఇప్పుడు కరోనా వచ్చి చేరింది. మనం ఏం చేయలేం. ఏమీచేయలేనప్పుడు దానితో కలిసి ఉండటమే పరిష్కారం.

"90 శాతం సినిమాలు ఫ్లాప్‌ అవడానికి కారణం ఊహించినట్టుగా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడమే. వారిని రప్పించడం కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తుంటారు. సినిమా నిర్మాణ వ్యయం ఒకెత్తైతే... ప్రచారం, థియేటర్‌ అద్దెలు, డిస్ట్రిబ్యూషన్‌ ఖర్చులు మరో ఎత్తు. అదే ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే నిర్మాణ వ్యయం తప్ప మరో ఖర్చు ఉండదు. అదనంగా ఖర్చు చేసి, ప్రేక్షకులు వస్తారో రారో అనే భయాలతో పోలిస్తే ఇది మేలు కదా. అందుకే ఓటీటీని చాలా మంది నిర్మాతలు ఉత్తమ ఎంపిక అనుకుంటారు. నా దృష్టిలో థియేటర్లు పరిశ్రమలో భాగం కాదు. ఒక వస్తువును ఉత్పత్తి చేశాక దాన్ని అమ్మే ఓ వేదిక మాత్రమే. ఇప్పుడు ఉత్పత్తిని ఏ వేదిక మీద నుంచైనా అమ్ముకోవచ్చు. సినిమా తీసేవాడు ప్రేక్షకులు చూడాలని తీస్తున్నాడు. ప్రేక్షకుడేమో తాను సినిమాను ఓటీటీలో చూస్తున్నానా లేక థియేటర్‌లోనా అనేది పట్టించుకోవడం లేదు. అలాగని థియేటర్‌ ఉండదని కాదు. ఓటీటీల ప్రభావం సినిమాపై బలంగా ఉంటుందని చెబుతున్నా".

ఇదీ చూడండి... త్రివిక్రమ్ సినిమాలో తారక్ డ్యుయల్ రోల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.