Ramcharan Thanks for RRR movie success: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తమ అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌తో కలిసి తాను హీరోగా నటించిన 'ఆర్ఆర్ఆర్' శుక్రవారం థియేటర్లలో విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చిత్రసీమల్లోనూ రికార్డు వసూళ్లను అందుకుంటోంది. క్రిటిక్స్ సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని రికార్డులు సృష్టిస్టోంది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన చరణ్.. చిత్రం భారీ విజయం సాధించడానికి కారణమైన అభిమానులకు , సినీప్రేక్షకులకు సోషల్‌మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. "రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా పట్ల మీరు చూపిస్తున్న అసమాన ప్రేమ, ఆదరణకు నా ధన్యవాదాలు. ఎంతో ఉత్సుకతతో థియేటర్లో చిత్రాన్ని చూసిన ప్రతిఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయాన్ని నా పుట్టినరోజు బహుమతిగా వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాను." అని చరణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అంతకుముందు హీరో ఎన్టీఆర్ కూడా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. "మీ వెలకట్టలేని ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. అవే నన్ను మరింత ముందుకు తీసుకెళ్తాయి. విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాను చూసి ఆస్వాదించండి" అని తారక్ ట్వీట్ చేశారు. కాగా, రూ.450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో తారక్, చరణ్‌తో పాటు అజయ్ దేవగణ్, ఆలియాభట్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య మూవీని నిర్మించారు.
-
Thank You 🙏🙏 pic.twitter.com/689w1QMl2w
— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank You 🙏🙏 pic.twitter.com/689w1QMl2w
— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2022Thank You 🙏🙏 pic.twitter.com/689w1QMl2w
— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2022
Ajith valimai ott records: కోలీవుడ్ ప్రముఖ నటుడు అజిత్ హీరోగా నటించిన చిత్రం 'వలిమై'. హెచ్.వినోద్ దర్శకుడు. హ్యుమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవలే థియేటర్లో విడుదలై సూపర్‌హిట్ టాక్‌ను అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లోనూ విశేష ఆదరణను సొంతం చేసుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 100మిలియన్ల నిమిషాలు స్ట్రీమింగ్ అయి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 ట్విట్టర్ వేదికగా తెలిపింది.
ఇదీ చూడండి: 'పుష్ప 2'లోనూ సమంత.. ఈ సారి ఆ పాత్రలో!