ETV Bharat / sitara

RRR: షూటింగ్​ పూర్తి.. చెప్పిన తేదీకే రిలీజ్​ - NTR dubbing complete RRR

రెండు పాటలు మినహా 'ఆర్​ఆర్​ఆర్'(RRR)​ సినిమా షూట్​ పూర్తైందని తెలిపింది చిత్రబృందం. రామ్​చరణ్(Ramcharan)​, ఎన్టీఆర్(NTR)​ రెండు భాషల్లో డబ్బింగ్​ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించింది.

RRR
ఆర్​ఆర్అర్​
author img

By

Published : Jun 29, 2021, 11:15 AM IST

Updated : Jun 29, 2021, 11:42 AM IST

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'(RRR) సినిమాలో రెండు పాటలు మినహా మిగతా షూటింగ్​ పూర్తైంది. కథానాయకులు ఎన్టీఆర్​, రామ్​చరణ్​ రెండు భాషల్లో డబ్బింగ్​ పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్వీట్​ చేస్తూ.. సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఈ చిత్రం ముందుగా అనుకున్న తేదీ ప్రకారమే అక్టోబర్​ 13న విడుదల కానుంది.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(Ramcharan), కొమురం భీమ్‌గా తారక్‌(NTR) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్‌ ఫర్‌ రామరాజు', 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్​' సెట్లో చరణ్​.. 'లూసిఫర్'​ రీమేక్​లో తమన్​​

Last Updated : Jun 29, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.