ETV Bharat / sitara

'జెర్సీ' డైరెక్టర్​తో రామ్​చరణ్​ పాన్ ఇండియా మూవీ - ramcharan sankar movie

హీరో రామ్​చరణ్(RC 16 movie)​ మరో కొత్త పాన్​ ఇండియా మూవీకి ఓకే చెప్పారు. తన కొత్త చిత్రాన్ని గౌతమ్​ తిన్ననూరి దర్శకత్వంలో(gowtam tinnanuri ram charan) నటించనున్నారు. చెర్రీ 16వ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందనుంది.

ram
రామ్​చరణ్​
author img

By

Published : Oct 15, 2021, 10:15 AM IST

Updated : Oct 15, 2021, 2:37 PM IST

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌ల విషయంలో దూకుడు పెంచేశారు. శంకర్ సినిమా షూట్‌ ప్రారంభంకాకముందే ఆయన మరో సినిమా ప్రకటించేశారు. ఈ మేరకు చెర్రీ హీరోగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌ చరణ్‌ 16వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ కాంబినేషన్‌ కోసం తాను ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గౌతమ్‌ సైతం.. చెర్రీతో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ‘జెర్సీ’ విడుదలైన సమయంలో గౌతమ్‌ పనితనాన్ని ప్రశంసిస్తూ చరణ్‌ దంపతులు ఓ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖను ట్విటర్‌లో షేర్‌ చేసిన గౌతమ్‌.. ‘ఎంతోకాలం నుంచి ఈ లేఖను దాచిపెట్టుకున్నాను. చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకున్నాను. ఇంత త్వరగా ఈ అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. లవ్‌ యూ చరణ్‌ సర్‌’ అని గౌతమ్‌ ట్వీట్‌ చేశారు.

ram
రామ్​

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ రెండు పూర్తైన వెంటనే ఆయన శంకర్‌తో చేయనున్న సినిమా రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొననున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధం కానున్న ఈ సినిమాలో చరణ్‌ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. దిల్‌రాజు నిర్మాత.

ఇదీ చూడండి: ఒకే వేదికపై చిరు-బాలయ్య.. ఫ్యాన్స్​కు పండగే!

Last Updated : Oct 15, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.