Ramcharan: సినిమాలతో నిత్యం బిజీగా ఉండే మెగా హీరోలు.. కుటుంబాలకు సమయం కేటాయించి సరదాగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఫిన్లాండ్కు విహారయాత్రకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిన్లాండ్కు వెళ్లడానికి ముందే ఉపాసన 'రెండు సంవత్సరాల తర్వాత వెకేషన్‌కు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్యూ చరణ్' అంటూ ట్వీట్ చేశారు.
ఇక మరో మెగా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం కూడా విహారయాత్రకు వెళ్లింది. అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి రాజస్థాన్‌లోని జవాలి ప్రాంతానికి వెళ్లారు. జవాలి కొండల్లో చిరుతపులులను వీక్షిస్తున్న వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' భారీ అంచనాల నడుమ మార్చి 25న విడుదల కాబోతుంది. ఇందులో చరణ్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం వల్ల అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'పుష్ప-1' తో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ 'పుష్ప-2' పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇదీ చదవండి: Prabhas Marriage Date: 'ప్రభాస్ పెళ్లి తేదీ అదే'