యువ కథానాయిక అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్వశ్చన్ మార్క్'. శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు విప్ర దర్శకత్వం వహించాడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదల సన్నాహాల్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్.
సంగీత దర్శకుడు రఘు కుంచె సారథ్యంలో 'రామసక్కనోడివిరో పిలగో' అంటూ సాగే పాటకు బండి సత్యం సాహిత్యాన్ని సమకూర్చగా మంగ్లీ ఆలపించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:గోన గన్నారెడ్డి పాత్రలో బాలయ్య!