అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా.. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన దర్శకత్వంలో రానున్న తదుపరి చిత్రం 'అపరాజిత అయోధ్య'లో రామ మందిరానికి సంబంధించి ఆరు శతాబ్దాల చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది.
-
...today Bharat is establishing Ram Rajya again the most glorious civilisation of all time where Ram is not just a King but a way of life 🙏 (2/2)#JaiShriRam #RamMandirAyodhya
— Team Kangana Ranaut (@KanganaTeam) August 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">...today Bharat is establishing Ram Rajya again the most glorious civilisation of all time where Ram is not just a King but a way of life 🙏 (2/2)#JaiShriRam #RamMandirAyodhya
— Team Kangana Ranaut (@KanganaTeam) August 5, 2020...today Bharat is establishing Ram Rajya again the most glorious civilisation of all time where Ram is not just a King but a way of life 🙏 (2/2)#JaiShriRam #RamMandirAyodhya
— Team Kangana Ranaut (@KanganaTeam) August 5, 2020
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 600 ఏళ్ల నాటి పురాతన ఆలయాల చరిత్రపై ఓ సినిమా రూపొందించనున్నట్లు కంగన స్పష్టం చేసింది. తాజాగా, రామ మందిర భూమి పూజకు సంబంధించిన సన్నివేశాలనూ అందులో చేర్చనున్నట్లు వివరించింది. ఈ చిత్రాన్ని 'భక్తి, విశ్వాసం, ఐక్యత ' కథగా పిలవనున్నట్లు పేర్కొంది.
-
What could not happen in 500 years happened this year.... this is not picture of the day but the moment of many centuries #JaiShreeRam #RamMandirAyodhya https://t.co/lyVONQ1k3i
— Team Kangana Ranaut (@KanganaTeam) August 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">What could not happen in 500 years happened this year.... this is not picture of the day but the moment of many centuries #JaiShreeRam #RamMandirAyodhya https://t.co/lyVONQ1k3i
— Team Kangana Ranaut (@KanganaTeam) August 5, 2020What could not happen in 500 years happened this year.... this is not picture of the day but the moment of many centuries #JaiShreeRam #RamMandirAyodhya https://t.co/lyVONQ1k3i
— Team Kangana Ranaut (@KanganaTeam) August 5, 2020
"నా చిత్రంలో రామ మందిరానికి అనుకూలంగా పోరాడిన అనేక మంది నిజమైన ముస్లిం పాత్రలు ఉన్నాయి. రామ రాజ్యం మతానికి అతీతమైంది. అదే 'అపరాజిత అయోధ్య'లో కనిపిస్తుంది. 600 ఏళ్లనాటి చరిత్రను చిత్రీకరించడానికి స్క్రీన్ ప్లే ఎంతో కష్టంగా ఉంటుంది. కె.వి. విజయేంద్ర ప్రసాద్ ఈ కథను అందంగా మలిచారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం."
-కంగనా రనౌత్, సినీ నటి
ఈ చిత్ర కథను 'బాహుబలి' స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాశారు. కంగన స్వీయ నిర్మాణం చేపడుతోంది. మరోవైపు బుధవారం అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ పునాదిరాయి వేశారు. ఈ క్రమంలోనే కంగన సంతోషం వ్యక్తం చేసింది.