విభిన్న కథలు, నేపథ్యాలను ఎంచుకుంటూ వాస్తవికతకు దగ్గరగా సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. అంతేకాదు, అంతకుమించి వివాదాలతో ఆడుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. 'రక్త చరిత్ర'తో ఫ్యాక్షన్‌ను తనదైన కోణంలో చూపించి సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. దానికి అనుబంధంగా ఇప్పుడు 'కడప్ప' పేరుతో ఓ వెబ్‌సిరీస్ తీయబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియోను షేర్ చేశారు.
"కొన్ని దశాబ్దాల పాటు పగల మూలంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలు బలితీసుకుంది ఫ్యాక్షన్ వార్. ప్రతీకార జ్వాలల నేపథ్యంలో తీస్తున్న మెగా వెబ్‌సిరీస్ 'కడప్ప' సంబంధించిన ఒక వీడియో ఇది. ఈ మెగావెబ్ సిరీస్‌లో మొదటి రెండు సీజన్లు పరిటాల హరి, పరిటాల రవి నిజ జీవితాల ఆధారంగా ఉండబోతున్నాయి. ఒక ప్రాంతపు వాస్తవ సంఘటనల ఆధారంగా నేషనల్ లెవెల్ డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానున్న మొట్ట మొదటి వెబ్ సిరీస్ 'కడప్ప'" అని పేర్కొన్నారు. మరి వర్మ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ వెబ్‌సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
-
Sneak peek of KADAPPA web series…పగల మూలంగా రాయలసీమలో వందల మంది ప్రాణాలు బలితీసుకున్న ఫ్యాక్షన్ వార్ ల నేపథ్యం లో తీస్తున్న మెగా వెబ్ సీరీస్ కి సంభందించిన వీడియో ఇది
— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
నేషనల్ లెవెల్ డిజిటల్ ప్లాట్ఫాం లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ వెబ్ సీరీస్ పేరు “కడప్ప “ pic.twitter.com/rYCvCWwhcU
">Sneak peek of KADAPPA web series…పగల మూలంగా రాయలసీమలో వందల మంది ప్రాణాలు బలితీసుకున్న ఫ్యాక్షన్ వార్ ల నేపథ్యం లో తీస్తున్న మెగా వెబ్ సీరీస్ కి సంభందించిన వీడియో ఇది
— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2021
నేషనల్ లెవెల్ డిజిటల్ ప్లాట్ఫాం లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ వెబ్ సీరీస్ పేరు “కడప్ప “ pic.twitter.com/rYCvCWwhcUSneak peek of KADAPPA web series…పగల మూలంగా రాయలసీమలో వందల మంది ప్రాణాలు బలితీసుకున్న ఫ్యాక్షన్ వార్ ల నేపథ్యం లో తీస్తున్న మెగా వెబ్ సీరీస్ కి సంభందించిన వీడియో ఇది
— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2021
నేషనల్ లెవెల్ డిజిటల్ ప్లాట్ఫాం లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ వెబ్ సీరీస్ పేరు “కడప్ప “ pic.twitter.com/rYCvCWwhcU
అన్నాచెల్లెళ్ల నేపథ్యంలో 'బ్రో'..
నవీన్‌చంద్ర, అవికాగోర్ అన్నా చెల్లెళ్లుగా నటించిన చిత్రం 'బ్రో'. సంజనసారథి, సాయి రోనక్ ప్రధాన పాత్రధారులు. కార్తీక్ తుపురాణి దర్శకత్వం వహిస్తున్నారు. జె.జె.ఆర్.రవిచంద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా లుక్‌ని కథానాయిక రష్మిక మందన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "అన్నాచెల్లెళ్ల నేపథ్యంలో సాగే ఓ ఫాంటసీ చిత్రమిది. భావోద్వేగాలకి ప్రాధాన్యం ఉంది. బలమైన కథ, పాత్రలు కావడం వల్ల.. నవీన్‌చంద్ర, అవికాగోర్ అన్నాచెల్లెళ్లుగా నటించారు. విశాఖతోపాటు పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అన్నారు. ఛాయాగ్రహణం: అజీమ్ మహ్మద్, సంగీతం: శేఖర్‌చంద్ర, కళ: ఎ.ఎస్.ప్రకాష్.
ఇదీ చదవండి:శారద మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు.. అసలేమైంది?