'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న రామ్‌చరణ్.. ప్రముఖ దర్శకుడు శంకర్‌తో తర్వాతి సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అని, హీరోయిన్గా దక్షిణాకొరియా నటి బే సూజీని ఎంపిక చేశారని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
దీనిని పాన్ ఇండియా సినిమాగా కాకుండా పాన్-ఆసియా ప్రాజెక్టుగా తీయాలనే ఆలోచనతోనే కొరియన్ నటిని దర్శక-నిర్మాతలు ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
బే సూజీ మంచి నటి కాకుండా గాయని. 'డ్రీమ్ హై' సిరీస్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. 'ఆర్కిటెక్చర్ 101'తో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ద సౌండ్ ఆఫ్ ఫ్లవర్, రియల్, వండర్లాండ్ అమాంగ్ అదర్స్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇవీ చదవండి: