మెగాహీరో రామ్‌చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'ఆర్ఆర్ఆర్' పోస్టర్ ఇప్పటికే అలరిస్తోంది. ఇప్పుడు 'ఆచార్య' చిత్రబృందం కూడా చరణ్‌కు విషెస్ చెప్పింది. సినిమాలో అతడు పోషిస్తున్న 'సిద్ధ' పాత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. దీంతో మెగాఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విద్యార్థి నాయకుడిగా చరణ్ నటిస్తున్నారు. అతడి సరసన పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, మణిశర్మ సంగీతమందిస్తున్నారు. మే 13న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.