ETV Bharat / sitara

రామ్​చరణ్-శంకర్ సినిమా కథ.. ఆ స్టార్ డైరెక్టర్​ది - ram charan RRR

Ram charan karthik subbaraj: రామ్​చరణ్ కొత్త సినిమాలో స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కూడా భాగమయ్యారు. తమిళంలో స్టార్ హీరోలతో చిత్రాలు చేస్తున్న ఈ దర్శకుడు.. చరణ్ సినిమాకు కథ అందించడం విశేషం.

ram charan shankar movie
రామ్​చరణ్ శంకర్ మూవీ
author img

By

Published : Feb 9, 2022, 8:27 AM IST

Ram charan shankar movie: ఓ రచయిత కథ రాస్తే, దానిని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అయితే రామ్​చరణ్ కొత్త సినిమాకు మాత్రం ఓ స్టార్ డైరెక్టర్ కథ రాయగా, మరో స్టార్ డైరెక్టర్ దానిని తీస్తున్నారు. ఈ విషయాన్ని సదరు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ స్వయంగా వెల్లడించారు.

రామ్​చరణ్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తీస్తున్న కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నారు. దీనికి మరో స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఇది పొలిటికల్ కథ అని చెప్పిన కార్తిక్.. శంకర్ సర్​కు ఇది నచ్చడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. అయితే కార్తిక్ కథ ఇవ్వగా, దానికి స్క్రీన్​ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ శంకర్ చూసుకుంటున్నారు.

shankar karthik subbaraj
శంకర్- కార్తిక్ సుబ్బరాజ్

ఫిబ్రవరి 10 నుంచి 28వ తేదీ వరకు #RC15 కొత్త షెడ్యూల్​.. రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇందులో చరణ్ సరికొత్త గెటప్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్. సునీల్, అంజలి, జయరాయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. దిల్​రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.