'ఆర్ఆర్ఆర్'(rrr release date) తర్వాత రామ్‌చరణ్(ram charan movies) హీరోగా, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు బుధవారం వెల్లడించారు.
పుణె, సతారా, పాల్టన్ ప్రాంతాల్లో ఫైట్ మాస్టర్స్ అన్బరివు నేతృత్వంలో స్పెషల్ సీక్వెన్స్‌ను ఈ షెడ్యూల్లో పూర్తిచేశారు. చిత్రబృందంతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రామ్‌చరణ్‌ను ఈ సినిమాలో శంకర్(shankar ram charan movie cast) సరికొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కియారా అడ్వాణీ(kiara advani movies) హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్(thaman songs) సంగీతమందిస్తున్నారు. దిల్‌రాజ్.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: