ETV Bharat / sitara

శంకర్​ సినిమాలో యంగ్​ లీడర్​గా చరణ్​​? - ఆర్​ఆర్​ఆర్​

దర్శకుడు శంకర్​తో చేయబోయే సినిమాలో హీరో రామ్​చరణ్​ ఓ యువ నాయకుడి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చెర్రీ 'ఆర్​ఆర్​ఆర్'​, 'ఆచార్య' సినిమాల్లో నటిస్తున్నారు.

Ram Charan playing a young leader role in Shankar's Directional
శంకర్​ సినిమాలో యంగ్​ లీడర్​గా చరణ్​​?
author img

By

Published : Jun 7, 2021, 7:23 AM IST

మెగా పవర్​స్టార్​ రామ్‌చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్​ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాల్ని రేకెత్తించింది. ఆ సినిమాను ప్రకటన వచ్చినప్పట్నుంచి అటు తమిళ పరిశ్రమలోనూ, ఇటు తెలుగులోనూ తరచూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కథ, రామ్‌చరణ్‌ పాత్ర గురించి పలు రకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే శంకర్‌ తన సినిమాల కథ, పాత్రల విషయంలో అత్యంత గోప్యత పాటిస్తుంటారు. ఎవ్వరూ ఊహించని రీతిలో సినిమాల్ని తీసి ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంటారు. రామ్‌చరణ్‌తో చేయనున్న సినిమా కోసమూ తనదైన శైలిలో స్క్రిప్టుని సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ యువ నాయకుడిగా దర్శనమిస్తారని తెలుస్తోంది. ఆయన కనిపించే విధానం ప్రత్యేకంగా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చమొదలైంది. రామ్‌చరణ్‌ నాయకుడైతే, సినిమా కథ రాజకీయం ప్రధానంగా సాగే అవకాశాలున్నాయి. 'ఒకే ఒక్కడు' సినిమాలో కథానాయకుడిని ఒక్క రోజు ముఖ్యమంత్రిగా చూపించి ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేశారు శంకర్​. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' తర్వాత శంకర్‌ చిత్రం కోసమే రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు చరణ్‌. ప్రతిష్టాత్మకమైన ఈ కలయికలో సినిమా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు 50వ చిత్రంగా రూపొందనుంది.

ఇదీ చూడండి: చెర్రీకి జోడీగా మరోసారి బాలీవుడ్​ బ్యూటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.