మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan) సోషల్‌మీడియాలో మరో ఘనత సాధించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 4 మిలియన్ల(4 Millions For Ram Charan)కు పైగా ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్నారు. చెర్రీ ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR) నటిస్తూ బిజీగా ఉన్నారు.
చిత్రపరిశ్రమలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన షూట్స్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్ చెర్రీతో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ‘లాక్‌డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో చరణ్ హెయిర్‌స్టైల్‌తో నా రోజు ప్రారంభమైంది. మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' షూట్‌కి చెర్రీ సిద్ధమయ్యారు' అని అలీమ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా తారక్ సందడి చేయనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న విషయం విదితమే.
'రిపబ్లిక్' డబ్బింగ్..
దేవకట్టా దర్శకత్వంలో యువ కథానాయకుడు సాయితేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'(Republic). మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు హీరో సాయి తేజ్ సోషల్‌మీడియాలో ఓ ఫొటో పంచుకున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
ఇన్సైడ్ ఎడ్జ్ 3..
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఇన్సైడ్ ఎడ్జ్'(Inside Edge) సిరీస్‌కు కొనసాగింపుగా మరో సీజన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌కు సంబంధించి సీజన్ 3ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో వివేక్ ఒబెరాయ్, రిచా చద్దా, సిద్ధాంత్ చతుర్వేది ప్రధానపాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన రెండు సీజన్లు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు మరో సీజన్ విడుదలకు సిద్ధమైంది.
ఇదీ చూడండి.. 'ఫ్రెండ్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెనక్కినెట్టిన 'ఫ్యామిలీ మ్యాన్ 2'