సీనియర్ నటుడు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'అహం బ్రహ్మస్మి'. పాన్ ఇండియా కథతో తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఈరోజు(శుక్రవారం) లాంఛనంగా ప్రారంభిమైందీ సినిమా. ముఖ్య అతిథిగా హాజరైన హీరో రామ్‌చరణ్.. మూహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. ఈ సందర్భంగా మోహన్‌బాబు.. రామ్‌చరణ్‌కు పూలమాల వేసి ఆశీర్వదించాడు.
అనంతరం చిత్రయూనిట్‌ను అడిగి, విశేషాలు తెలుసుకున్నాడు చరణ్. 'అహం బ్రహ్మస్మి' ఘనవిజయం సాధించాలని కోరుకున్నాడు. ఈ వేడుకలో చరణ్ సోదరి సుష్మిత, మంచు లక్ష్మి సందడి చేశారు.
ఈ సినిమాలో మనోజ్ సరసన కన్నడ మోడల్ ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. తనికెళ్ల భరణి, మురళీశర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈనెల 11 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుందని హీరో మనోజ్ చెప్పాడు.