శనివారం మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వారితో పాటు పలువురు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం కూడా ఆయనకు ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో చెర్రీ చేత కేక్ కట్ చేయించి.. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ.. ఈ వేడుకల్లో చరణ్‌ను ఆశ్చర్యపోయేలా చేశారు. క్రేన్ సహాయంతో బర్త్‌డే బోర్డు ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి వెండితెర యువ అల్లూరిని ఆనందంలో ముంచెత్తారు.
-
A little surprise to our sweetest Ramaraju on our sets last night.. We hope you loved it, @alwaysramcharan. ❤️🔥 #HBDRamCharan #RRRMoviehttps://t.co/yDRSTqZcT2 #RRR @ssrajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies
— DVV Entertainment (@DVVMovies) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A little surprise to our sweetest Ramaraju on our sets last night.. We hope you loved it, @alwaysramcharan. ❤️🔥 #HBDRamCharan #RRRMoviehttps://t.co/yDRSTqZcT2 #RRR @ssrajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies
— DVV Entertainment (@DVVMovies) March 27, 2021A little surprise to our sweetest Ramaraju on our sets last night.. We hope you loved it, @alwaysramcharan. ❤️🔥 #HBDRamCharan #RRRMoviehttps://t.co/yDRSTqZcT2 #RRR @ssrajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies
— DVV Entertainment (@DVVMovies) March 27, 2021
శుక్రవారం 'ఆర్ఆర్ఆర్'లోని సీతారామరాజు రూపంలో ఉన్న చెర్రీ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
రామ్‌చరణ్‌కు హీరో ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తామిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. "ఈ ఏడాది మాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ తమ్ముడు" అని ట్వీట్ చేశారు.
తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చెర్రీ అరుదైన గౌరవాన్ని పొందారు. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న నాస్డాక్ భారీ భవంతిపై ఆయన ఫొటోలు ప్రదర్శించారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందిన మొట్టమొదటి దక్షిణాది నటుడిగా ఆయన ఘనతను అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సతీమణి కొణిదెల ఉపాసన పోస్ట్ చేశారు.
-
This is just WOW 🤩
— Upasana Konidela (@upasanakonidela) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
what a sweet gesture
Thanks for all the love 🤗
@Nasdaq #usa #newyork #timessquare pic.twitter.com/UUCC5DzMTi
">This is just WOW 🤩
— Upasana Konidela (@upasanakonidela) March 27, 2021
what a sweet gesture
Thanks for all the love 🤗
@Nasdaq #usa #newyork #timessquare pic.twitter.com/UUCC5DzMTiThis is just WOW 🤩
— Upasana Konidela (@upasanakonidela) March 27, 2021
what a sweet gesture
Thanks for all the love 🤗
@Nasdaq #usa #newyork #timessquare pic.twitter.com/UUCC5DzMTi
ప్రస్తుతం చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య'లోనూ నటిస్తున్నారు. త్వరలోనే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
ఇదీ చూడండి: రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా స్పెషల్ సాంగ్
ఇదీ చూడండి: 'రంగస్థలం'లో అభిమానులు మెచ్చిన మగధీరుడు!