కరోనా విరామం తర్వాత సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్‌పైకి వెళుతున్నాయి. వచ్చే నెల్లో దాదాపు అగ్ర హీరోలంతా కెమెరా ముందుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్లు తమ పాత్రల్ని దృష్టిలో ఉంచుకుని కసరత్తులు మొదలు పెట్టారు. మేకప్ టెస్టులు, ఫొటోషూట్‌ల్లో పాల్గొంటున్నారు. మెగాస్టార్ తన తర్వాతి చిత్రం కోసం ఇప్పటికే గుండు లుక్‌లో కన్పించారు.
![Ram Charan and Rashmika take part in make-up tests for new movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8928729_2.jpg)
నయా లుక్‌లో చెర్రీ
ఇప్పుడు రామ్‌చరణ్ 'ఆచార్య' కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నాయిక రష్మిక 'పుష్ప' చిత్రంలోని పాత్రకు మేకప్ వేసుకుని చూసుకొంటోంది. చిరంజీవితో కొరటాల శివ 'ఆచార్య' తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక లుక్‌కి తగ్గట్టుగా రామ్‌చరణ్ కసరత్తులు షురూ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఆయన ఆ వేషంతో లుక్ టెస్ట్‌లో పాల్గొనబోతున్నట్టు తెలిసింది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణ పునః ప్రారంభం కావడం కంటే ముందే, రామ్‌చరణ్ 'ఆచార్య' చేయడానికి రంగంలోకి దిగనున్నారని తెలిసింది.
![Ram Charan and Rashmika take part in make-up tests for new movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8928729_1.jpg)
'పుష్ప'రాజ్ కోసం..
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 'పుష్ప' కోసం త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇందులో కథానాయికగా రష్మిక నటిస్తోంది. ఆమె ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ, చిత్తూరు యాసలో మాట్లాడుతూ సందడి చేయబోతోంది. కొన్ని రోజులుగా ఆ యాసకు సంబంధించిన పాఠాలనూ నేర్చుకొంటోంది రష్మిక. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన ఆమె, రెండు రోజులుగా మేకప్ టెస్టుల్లో పాల్గొంటోంది.