ETV Bharat / sitara

ప్రభాస్ సవాలు స్వీకరించిన రామ్​చరణ్ - RRR MIOVIE NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న హీరో రామ్​చరణ్.. మొక్కలు నాటి తన వంతు బాధ్యత నిర్వర్తించారు. తన అభిమానులు కూడా మొక్కలు నాటాలని సూచించారు.

ram charan accepted green india challenge and planted saplings
ప్రభాస్ సవాలు స్వీకరించిన రామ్​చరణ్
author img

By

Published : Nov 8, 2020, 10:44 AM IST

Updated : Nov 8, 2020, 2:15 PM IST

డార్లింగ్ ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించారు అగ్ర కథానాయకుడు రామ్​చరణ్. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎంపీ సంతోష్ కుమార్​తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వాటితో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం తాను నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్, చిత్రబృందంతో పాటు అభిమానులు మొక్కలు నాటాలని సవాలు విసిరారు.

"ఈ సీజన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా స్నేహితుడు ప్రభాస్.. నాకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతుల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద బతకగలుగుతాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" ద్వారా కదిలిస్తున్న ఎంపీ సంతోష్​ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను" అని రామ్ చరణ్ చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 8, 2020, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.