ETV Bharat / sitara

పవన్ కల్యాణ్ చిత్రంలో రామ్​ చరణ్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్​చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

Ram Charam to cameo in Pawan Kalyan movie
పవన్ రామ్ చరణ్
author img

By

Published : Jul 2, 2020, 9:41 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొత్త చిత్రం చేస్తున్నాడంటే చాలు ఆయన అభిమానుల్లో చెప్పలేని ఆనందం. ప్రస్తుతం ఆయన క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఇందులో రామ్‌చరణ్‌ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పాన్‌ ఇండియా స్థాయిలో ఓ పీరియాడికల్‌ చిత్రంగా తెరకెక్కుతోందీ చిత్రం. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ జరుపుకొంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా మొగలాయిల కాలం నాటి ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందబోతుందని, ఇందులో పవన్‌ రాబిన్‌హుడ్‌ తరహాలో పవర్‌ఫుల్‌ దొంగలా దర్శనమివ్వబోతున్నారని వార్తలు బయటకొచ్చాయి.

రామ్‌చరణ్‌ ఇప్పటికే తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తం మీద ఇటు తండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే, మరోవైపు బాబాయి చిత్రంలో అతిథి పాత్రలో చేయనున్నారనే వార్త మెగా అభిమానులకు శుభవార్తే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.