"జీవన ప్రయాణంలో విరామం వచ్చినప్పుడు... ప్రతి క్షణం రొటీన్‌గా మారినప్పుడు.. ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్నదే మనల్ని నిర్వచిస్తుంది" అంటోంది రకుల్‌ప్రీత్ సింగ్. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరి దైనందిన జీవితం ఒకేలా మారిపోయింది. దీనికి తానూ మినహాయింపు కానప్పటికీ.. ఈ విరామాన్ని తానెంత చక్కగా వినియోగించుకుంటున్నది ఓ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది రకుల్.
ఉదయాన్నే నిద్రలేచి కాఫీ తాగి, కాసేపు వ్యాయామం చేయడం, తర్వాత కాసేపు ఓ పుస్తకం చదివి, సామాజిక మాధ్యమాలకి కాస్త సమయం కేటాయించడం... మిగతా సమయంలో ఆస్కార్ పురస్కారాలు అందుకున్న చిత్రాలు, నచ్చిన వెబ్ సిరీస్‌లు చూడటం...ఇలా రోజును గడుపుతున్నట్లు ఆ వీడియో ద్వారా తెలియజేసింది రకుల్.
ఇదీ చూడండి : 'ఇకనైనా మన తప్పులను తెలుసుకోవాలి'