ETV Bharat / sitara

గట్టిగా ఏడ్చేసిన రకుల్‌.. ఎందుకో తెలుసా..! - రకుల్​ ప్రీత్​ సింగ్​ ఏడ్పు

ఎప్పుడూ చలాకీగా కనిపించే హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్(Rakulpreet singh cried)​ ఒక్కసారిగా చిన్నపిల్లలా గట్టిగా ఏడ్చింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో షేర్​ చేసింది. ఇంతకీ ఏమైంది?

rakul
రకుల్​
author img

By

Published : Jul 25, 2021, 6:56 AM IST

సోషల్‌ మీడియాలో ఫిట్‌నెస్‌ చిట్కాలు చెప్తూ సినిమా అప్డేట్లు ఇస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌(Rakulpreet singh cried). అయితే.. ఎప్పుడు చూసినా చలాకీగా కనిపించే ఆమె ఒక్కసారిగా చిన్నపిల్లలా గట్టిగా ఏడ్చేసింది. కంగారు పడకండి. ఆమె ఏడ్చిన మాట వాస్తవమే అయినా.. ఏడ్చింది మాత్రం నిజంగా కాదు. ఓ సినిమా డబ్బింగ్‌లో భాగంగా ఆమె ఏడ్చింది. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్​ చేసింది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రం 'అటాక్‌'లో నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం సరసన ఆమె జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి సందడి చేయనుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఆ సినిమాకు డబ్బింగ్‌ చెప్పే పనుల్లో రకుల్‌ మునిగిపోయిందిప్పుడు. అందులో భాగంగానే ఓ ఏడుపు సన్నివేశానికి డబ్బింగ్‌ చేప్తున్న క్రమంలో తీసిన వీడియోను ఆమె పోస్ట్​ చేసింది.

ప్రస్తుతం చేతి నిండా బాలీవుడ్‌ సినిమాలతో రకుల్‌ బిజీబిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో మొత్తం అరడజనుకు పైగా సినిమాలకు ఆమె సంతకం చేసింది. తెలుగులోనూ క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో ఆమె నటించనుంది. దీంతో పాటు కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఇండియన్‌2'లోనూ రకుల్‌ సందడి చేయనుంది. మరోవైపు 'మేడే' అనే చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ఆ సినిమాకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌దేవ్‌గణ్‌ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించనున్నారు. అందులో అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌దేవ్‌గణ్‌, రకుల్‌ కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రకుల్‌ నటించిన ‘అటాక్‌’ లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 13న ఆ సినిమా విడుదల కానుంది.

ఇదీ చూడండి: Rakul Preet: బుల్లి గౌనులో.. బబ్లీ బ్యూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.