బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ మలేసియా గోల్డెన్ గ్లోబల్ అవార్డుల జ్యూరీకి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. దక్షిణ కొరియా సినిమాటోగ్రఫర్ కిమ్ హ్యాంగ్, నటుడు సిసిలియా, దర్శకుడు అన్వర్‌తో కూడిన జ్యూరీ సభ్యులతో కలవనున్నాడు హిరాణీ.
2017లో మొదటి సారి మలేసియా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(ఎమ్ఐఎఫ్ఎఫ్) జరిగింది. ప్రస్తుతం మూడో సీజన్ జులై 14 నుంచి 19 వరకు అమెరికా లాస్ఏంజిల్స్లో జరగనుంది. జులై 20న ఎమ్ఐఎఫ్ఎఫ్ అధ్వర్యంలో మలేసియా గోల్డెన్ గ్లోబల్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం కానుంది.
మలేసియా వాసుల ప్రతిభను అంతర్జాతీయంగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎమ్ఐఎఫ్ఎఫ్ మంచి వేదిక అవుతుందని ఎమ్ఐఎఫ్ఎఫ్ ఛైర్మన్ జోవానా గో తెలిపారు.