సూపర్‌స్టార్ రజినీకాంత్.. త్వరలో రచయితగా మారనున్నారట. ఏ డైలాగ్ అయినా అనర్గళంగా చెప్పే ఈయన.. ఈసారి తానే స్వయంగా వాటిని రాయనున్నారట. దర్శకుడు శివ రజినీతో 'అన్నాత్త' చిత్రం తీస్తున్నారు. ఇందులోని కొన్ని సంభాషణలు తలైవా అందిస్తున్నారని కోలీవుడ్‌లో చాలా ప్రచారం జరుగుతుంది.
గతంలో 'బాబా' సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు రజినీ. ఇప్పుడు డైలాగ్స్ రాస్తున్నారనడం వల్ల అందరిలోనూ తెగ ఆసక్తి పెరిగింది. ఇది ఎంత నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ హీరోయిన్లు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేశారు కానీ లాక్‌డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే చిత్రీకరణ తిరిగి ప్రారంభిస్తారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.