ETV Bharat / sitara

త్వరలో 'అన్నాత్త' షూటింగ్​కు రజనీకాంత్? - Rajinikanth movie news

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్న రజనీకాంత్.. మార్చి 15 నుంచి కొత్త సినిమా షూటింగ్​కు హాజరయ్యేలా కనిపిస్తున్నారు. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Rajinikanth to resume Annaatthe shoot
త్వరలో 'అన్నాత్త' షూటింగ్​కు రజనీకాంత్
author img

By

Published : Feb 26, 2021, 9:44 PM IST

Updated : Feb 26, 2021, 10:12 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అన్నాత్త'. శివ దర్శకుడు. గత డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడం వల్ల షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, వైద్యుల సూచన మేరకు రజనీ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని త్వరలోనే సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించుకోవచ్చని నిర్మాతలకు రజనీ చెప్పారట. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ షూటింగ్‌ని మార్చి 15న తిరిగి ప్రారంభించడానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం.

అయితే చెన్నై లేదా హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్, ఖుష్బూ, మీనా కథానాయికలు. డి.ఇమ్మాన్‌ సంగీతమందిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ నవంబర్‌ 4న ప్రేక్షకులు ముందుకు సినిమాను తీసుకురానున్నారు.

Last Updated : Feb 26, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.