ETV Bharat / sitara

Annaatthe Shooting: కోల్​కతాలో రజనీకాంత్​​ - కోల్​కతాలో అన్నాత్తే షూటింగ్​

తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్​(Rajinikanth) ప్రధానపాత్రలో నటిస్తున్న 'అన్నాత్తే'(Annaatthe) చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్​ను కోల్​కతాలో బుధవారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొందని కోలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

Rajinikanth To Jet Off To Kolkata For The Final Schedule Of 'Annaatthe'
Annaatthe Shooting: కోల్​కతాలో రజనీకాంత్​​
author img

By

Published : Jul 15, 2021, 7:41 AM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్(Rajinikanth)​ కథానాయకుడిగా జె.శివకుమార్​ రూపొందిస్తున్న చిత్రం 'అన్నాత్తే'(Annaatthe). సన్​పిక్చర్స్​ పతాకంపై కళానిధి మారన్​ నిర్మిస్తున్నారు. మీనా, ఖుష్బు, నయనతార, కీర్తి సురేశ్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్​ కోసం కోల్​కతాలో రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం రజనీ ఇప్పటికే ఆ నగరానికి చేరుకున్నారని సమాచారం.

బుధవారం నుంచే చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నట్లు సమాచారం. నెలాఖరు వరకు చిత్రీకరణ కొనసాగే అవకాశం ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. డి ఇమ్మాన్​ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

దీపావళికి రిలీజ్​..

గతేడాది దీపావళికి విడుదల కావాల్సిన 'అన్నాత్తే' చిత్రం కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఇటీవలే షూటింగ్​ను చిత్రబృందం తిరిగి ప్రారంభించగా.. ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై చిత్రబృందం ఇటీవలే స్పష్టత ఇచ్చింది.

Rajinikanth To Jet Off To Kolkata For The Final Schedule Of 'Annaatthe'
'అన్నాత్తే' సినిమా రిలీజ్​ పోస్టర్​

ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబరు 4న (Annaatthe Release Date) చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు నిర్మాణసంస్థ సన్​ పిక్చర్స్​ ప్రకటించింది.

ఇదీ చూడండి.. Kangana: నిర్మాతగా, వ్యాఖ్యాతగా తొలి అడుగులు​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.