'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం ద్వారా బుల్లితెరలో అరంగేట్రం చేశాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. చిత్రీకరణలో తనకు సహాయాన్నందించిన బ్రిటీష్ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌కు ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపాడు. ఈ అడ్వెంచర్ షోను చూడాలని తన అభిమానులను ట్విట్టర్లో కోరాడు. ఈ కార్యక్రమం సోమవారం రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్లో ప్రసారమైంది.
ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని బంధీపూర్ అడవిలో చిత్రీకరణ జరిపారు. అందులో బేర్‌గ్రిల్స్‌తో పాటు రజనీకాంత్ పాల్గొన్నాడు. ఆ సమయంలో అతడు గాయపడ్డాడు. ప్రధాని మోదీ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండో భారతీయుడు రజనీకాంత్.
-
One of the most adventurous experiences of my life !! Hope you all enjoy watching this show as much as I did being on it !!!#IntoTheWildWithBearGrylls @BearGrylls thank you so much my friend @DiscoveryIN 👍🏻🙏🏻
— Rajinikanth (@rajinikanth) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">One of the most adventurous experiences of my life !! Hope you all enjoy watching this show as much as I did being on it !!!#IntoTheWildWithBearGrylls @BearGrylls thank you so much my friend @DiscoveryIN 👍🏻🙏🏻
— Rajinikanth (@rajinikanth) March 23, 2020One of the most adventurous experiences of my life !! Hope you all enjoy watching this show as much as I did being on it !!!#IntoTheWildWithBearGrylls @BearGrylls thank you so much my friend @DiscoveryIN 👍🏻🙏🏻
— Rajinikanth (@rajinikanth) March 23, 2020
తప్పుగా అర్ధం చేసుకున్నారు
కరోనా వైరస్‌పై రజినీకాంత్ చేసిన ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. అతడి వ్యాఖ్యలపై విమర్శలు రావటం వల్ల దాన్ని తీసివేసినట్టు ట్విట్టర్ తెలిపింది. ఈ విషయంపై తాజాగా స్పందించాడు రజనీకాంత్.
కర్ఫ్యూలో భాగంగా ప్రజలు 12 నుంచి 14 గంటల వరకు బయటకు వెళ్లకపోతే దాన్ని మూడో స్టేజ్‌కు వెళ్లకుండా అడ్డుకోవచ్చనే ఉద్దేశంతో ట్వీట్ చేశానని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను జనతా కర్ఫ్యూ ఒక్కరోజే సరిపోతుందా అని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని విచారం వ్యక్తం చేశాడు. అందుకే ట్విట్టర్ తన వ్యాఖ్యలను తొలగించిందని వెల్లడించాడు.
ఇదీ చూడండి.. నేను భవిందర్ను పెళ్లి చేసుకోలేదు: అమలాపాల్