ETV Bharat / sitara

పునీత్​ను గుర్తుచేసుకున్న రజనీ.. ఫ్యాన్స్​ ఫైర్​

author img

By

Published : Nov 10, 2021, 2:19 PM IST

ఇటీవలే(puneeth rajkumar death news) గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ ప్రముఖ నటుడు పునీత్​ రాజ్​కుమార్​ను​ గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు సూపర్​స్టార్​ రజనీకాంత్(puneeth rajkumar rajinikanth)​. అప్పు లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన అభిమానులు రజనీపై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే?

rajni
రజనీ

గుండెపోటుతో(puneeth rajkumar death news) మరణించిన కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ను(అప్పు) అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుచేసుకుంటున్నారు(puneeth rajkumar condolence). కొంతమంది బెంగళూరులోని అప్పు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.

తాజాగా పునీత్​ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు సూపర్​స్టార్​ రజనీకాంత్(puneeth rajkumar rajinikanth)​. అప్పు లేరన్న నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. "నువ్వు లేవన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నీ ఆత్మకు శాంతి కలుగుగాక" అని రజనీ ట్వీట్​ చేశారు.

  • நீ இல்லை என்பதை என்னால் ஏற்றுக் கொள்ள முடியவில்லை புனீத்…
    Rest in peace my child https://t.co/ebAa5NhJvj

    — Rajinikanth (@rajinikanth) November 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రజనీపై విమర్శలు

రజనీ.. వాయిస్​ ఆధారంగా పనిచేసే 'హూట్' అనే సోషల్​మీడియా యాప్​ను ఇటీవలే ప్రారంభించారు. ​దీనిద్వారానే పునీత్​ను గుర్తుచేసుకుంటూ ట్వీట్​ చేశారు. అయితే దీనిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "మీలాంటి లెజెండ్.. యాప్ ప్రమోషన్ కోసం సంతాపం తెలుపుతూ సందేశాలు ఇవ్వడం సరికాదు", "సంతాపం తెలుపుతున్నట్లు లేదు.. యాప్​ ప్రమోషన్​ చేస్తున్నట్లు ఉంది సార్"​ అంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

rajni
రజనీపై విమర్శలు
rajni
రజనీపై విమర్శలు
rajni
రజనీపై విమర్శలు

గుండెపోటుతో

అక్టోబర్​ 29న ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు(puneeth rajkumar heartattack). ఈ విషయం తెలియగానే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ పలు భాషలకు చెందిన నటీనటులు, అభిమానులు.. పునీత్​ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.

ఇదీ చూడండి: పునీత్ స్ఫూర్తితో.. నేత్రదానం కోసం 400 మంది దరఖాస్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.