ETV Bharat / sitara

Rajinikanth: అమెరికాకు తలైవా పయనం - తలైవా

సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం సూపర్​స్టార్​ రజనీకాంత్​ అమెరికా బయలుదేరారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.

Rajinikanth
రజినికాంత్​
author img

By

Published : Jun 19, 2021, 9:36 PM IST

అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శనివారం అమెరికా బయలుదేరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన వెళ్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. రజనీతో పాటు ఆయన సతీమణి లత చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తలైవా.. 'అన్నాత్తే'లో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. వచ్చే నెల నుంచి 'అన్నాత్తే' షూట్‌ పునఃప్రారంభం కానుందట. ఇందులో రజనీకి జంటగా నయనతార సందడి చేయనున్నారు. ఖుష్బూ, మీనా, జగపతిబాబు, కీర్తి సురేశ్‌ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి:Telugu cinema: తెలుగులోకి తమిళ హీరోలు.. అస్సలు తగ్గట్లే

శేఖర్​ కమ్ముల- ధనుష్​ సినిమాలో సాయి పల్లవి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.