ఒకరు సూపర్‌స్టార్.. మరొకరు విశ్వనటుడు. 35 ఏళ్ల క్రితం వీరిద్దరూ 'గిరఫ్తార్' అనే సినిమాలో కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. వారే కోలీవుడ్‌కు చెందిన రజనీకాంత్.. కమల్‌హాసన్. ఈ విషయమే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
నేడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పెళ్లిరోజు. ఈ రోజుతో అతడి వైవాహిక జీవితానికి 39 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా సామాజిక వేదికగా అభిమానులంతా తలైవాకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే సమయంలో రజనీ తర్వాత సినిమా గురించి వార్త సందడి చేసింది.
తన 168వ చిత్రం 'అన్నాత్త'తో బిజీగా ఉన్నాడు రజనీ. తర్వాతి సినిమాకు కమల్ హాసన్ నిర్మించనున్నాడని సమచారం. 'ఖైదీ' ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహించనున్నాడట. వచ్చే నెల 5న పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నారని టాక్.
![raj-kanal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6213543__rk.jpg)
ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, అభిమానులు మాత్రం అప్పుడే పండగ చేసుకుంటున్నారు. ఇదే నిజమైతే దాదాపు 35 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ కలిసి పనిచేసినట్లవుతుంది.
![raj-kanal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6213543_asd.jpg)
ఇదీ చూడండి : ప్రేమపక్షులు: రజనీ, లత పరిణయానికి 39 ఏళ్లు